తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్తపై లైంగిక దాడి చేసిన అల్లుడు - rape cases in news

వావివరుసలు మరిచిన ఓ వ్యక్తి... పిల్లనిచ్చిన అత్తపైనే అఘాయిత్యానికి పాల్పపడ్డాడు. మద్యం మత్తులో అత్తపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Son-in-law sexually
అత్తపై లైంగిక దాడి చేసిన అల్లుడు

By

Published : Dec 13, 2019, 10:04 PM IST

హైదరాబాద్‌లో అత్తపై అల్లుడు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన 48 సంవత్సరాల మహిళ 2016 నుంచి తన కుమార్తె, అల్లుడితో కలిసి శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తోంది. కుమార్తె, అల్లుడు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కార్యాలయాలకు వెళ్లిన సమయంలో మనవడిని బాగోగులు చూసుకుంటూ.. మహిళ ఇంట్లో ఉంటోంది.

మహిళ నిద్రావస్థలో ఉండగా... మద్యం మత్తులో ఉన్న అల్లుడు అత్త అరవకుండా నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. గత నెల 13న తనపై లైంగిక దాడి జరిగినట్టు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

ABOUT THE AUTHOR

...view details