తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి బైక్​ కొనివ్వలేదని కొడుకు బలవన్మరణం - సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్

వరుస రోడ్డు ప్రమాదాలను చూసి ఆ తండ్రి చలించిపోయాడు. తనకా పరిస్థితి రావొద్దని ముందుగానే నిశ్చయించుకున్నాడు. అప్పుడే బైక్ కొనిస్తే కొడుకు ఏమైపోతాడోనని బయపడ్డాడు. అందుకే ఇంకొంతకాలం ఆగాలని కుమారుడిని బతిమిలాడాడు. కానీ... అర్థం చేసుకోలేని ఆ కొడుకు మాత్రం ఆత్మహత్యకు యత్నించాడు. తండ్రి ఆశలన్నీ అడియాసలు చేసేసి తనువు చాలించాడు. హైదరాబాద్​లోని బీహెచ్​ఈఎల్ టౌన్​షిప్​లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

తండ్రి బైక్ కొనలేదని కుమారుడు ఆత్మహత్య

By

Published : Sep 24, 2019, 11:55 PM IST

తండ్రి బైక్ కొనలేదని కుమారుడు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి రామచంద్రాపురం మండలంలోని తండ్రి ద్విచక్ర వాహనం కొనిపెట్టలేదని కుమారుడు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బీహెచ్​ఈఎల్ టౌన్ షిప్​లో పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అనిల్​ను ఆయన కుమారుడు రిషికేశ్ కొంత కాలంగా ద్విచక్ర వాహనం కొనివ్వాలని అడుగుతున్నాడు. వాహనం ఇప్పుడే వద్దని నచ్చ చెప్పిన తండ్రిపై అలిగిన రిషికేశ్ ఉదయం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమ కుమారుడు ఇంత పని చేస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఎదిగి వచ్చిన కొడుకు కానరాని లోకానికి వెళ్లాడనే చేదు నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రామచంద్రపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details