తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు - కనకదుర్గమ్మ వెండి రథం ప్రతిమలు అదృశ్యం వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాల్లో ఒక్క సింహ ప్రతిమే ఉందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రతిమల వార్తలు బయటికొచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల బృందం ఉదయం ఆలయాన్ని సందర్శించింది. రథానికి ఉన్న సింహా ప్రతిమలను పరిశీలించింది. రెండు రోజుల్లో నివేదికను ప్రజలను తెలియజేయాలని నేతలు డిమాండ్ చేశారు.

somu-veerraju-comments-on-indrakeeladri-silver-chariot-issue
ఏపీ: నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు

By

Published : Sep 16, 2020, 12:07 PM IST

ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలను భాజపా నేతల బృందం పరిశీలించింది. దుర్గ గుడి వద్ద ఉన్న రథానికి అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి రథానికి తగిన భద్రత ఉండాలని తెలిపారు. రథం ఖరీదు సుమారు రూ. 15లక్షలు ఉంటుందని ఈవో చెప్పారని వెల్లడించారు. నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే ఉండటాన్ని గమనించామని చెప్పారు.

ప్రతిమలు లాకర్​లో ఉన్నాయని చెప్పేందుకు ఈవో ప్రయత్నించారని... కానీ పరిస్థితిని చూస్తే వాటిని ధ్వంసం చేసినట్లు కనిపిస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఘటనకు సంబంధించి రెండు రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details