Somu Veerraju: జనసేన, భాజపా పొత్తు విషయంలో.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అనంతపురంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు. జనసేనతో దూరం పాటించాలని భాజపా నిర్ణయించినట్లుగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇరు పార్టీలు కలిసే ప్రయాణం చేస్తాయని ఆయన అన్నారు.
జనసేనతో భాజపా పొత్తు... క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు - అనంతపురం సోము వీర్రాజు
Somu Veerraju: జనసేన భాజపా పొత్తు విషయంలో ప్రచారం జరుగుతున్న అసత్య వార్తలను.. భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. రాష్ట్రంలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు