తెలంగాణ

telangana

ETV Bharat / state

Somireddy: ఎన్టీఆర్ భవన్​పై వాళ్లే దాడి చేశారు.. ఇవిగో కీలక ఆధారాలు - సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి తాజా వార్తలు

ఏపీలో ఎన్టీఆర్ భవన్​పై దాడికి సంబంధించిన కీలక ఆధారాలను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. వైకాపా నేతలు ఎవరెవరు దాడిలో పాల్గొన్నారో ఆయన వెల్లడించారు.

Somireddy
ఎన్టీఆర్ భవన్​పై దాడి.. ఆధారాలు

By

Published : Oct 22, 2021, 2:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ భవన్​పై దాడికి సంబంధించిన కీలక ఆధారాలను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాకి విడుదల చేశారు. దాడి చేసిన నిందితుల్ని.. డీఎస్పీ దగ్గర ఉండి సాగనంపారంటూ ఓ వీడియో ప్రదర్శించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారును పార్టీ కార్యాలయంపై దాడికి వినియోగించారని ఆరోపించారు. ఈ దాడిలో.. వైకాపా నేత జోగరాజు, వైకాపా కార్పొరేటర్ అరవ సత్యం, అప్పిరెడ్డి పానుగంటి చైతన్య, రోషన్ షైక్ వంటి వారు పాల్గొన్నారని, తమ వద్దనున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా కన్పిస్తోందని సోమిరెడ్డి తెలిపారు.

ఎన్టీఆర్ భవన్​పై దాడి.. ఆధారాలు

పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని డీఎస్పీ దగ్గరుండి కారెక్కించి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం బంద్ చేయకూడదనేలా వ్యవహరిస్తున్న పోలీసులు.. వైకాపా నిరసన కార్యక్రమాలకు మాత్రం ఎస్కార్ట్ ఇచ్చి నిర్వహిస్తున్నారన్నారని విమర్శించారు. పోలీసులు ప్రజల జీతగాళ్లుగా ఉండాలని.. జగన్ జీతగాళ్లు కాదనే విషయాన్ని గుర్తించాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితవు పలికారు.

తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కింద స్థాయిలో కానిస్టేబుళ్లు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. జగన్ పాపాలు పండాయన్న సోమిరెడ్డి.. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు.

ఇదీ చదవండి:paritala sunitha Comments : మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత

ABOUT THE AUTHOR

...view details