తెలంగాణ

telangana

ETV Bharat / state

దుర్గం చెరువు తీగల వంతెనపై ఆంక్షలేమిటో తెలుసా? - దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై ఆంక్షలు

హైదరాబాద్​ దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనపై ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కేబుల్ వంతెన భద్రత, ట్రాఫిక్ నివారణ కోసం తీసుకున్న చర్యల గురించి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

some restrictions on the durgam cheruvu cable bridge hyderabad
దుర్గం చెరువు తీగల వంతెనపై ఆంక్షలేమిటో తెలుసా?

By

Published : Oct 3, 2020, 11:04 PM IST

దుర్గం చెరువు తీగల వంతెనపై ఆంక్షలేమిటో తెలుసా?

హైదరాబాద్​ దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనపై ప్రయాణించేందుకు పోలీసులు కొన్ని నిబంధనలు ప్రకటించారు. ముఖ్యంగా తీగల వంతెనను చూడటానికి వచ్చిన పర్యటకులు పాదచారుల మార్గంలోనే నడవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ సూచించారు. పలువురు ఇష్టారీతిన వ్యవహరిస్తూ వాహనదారుల మార్గంలోకి వస్తున్నారని అన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మరికొందరు వంతెనపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారని..అలాంటివి చేయొద్దని కోరారు.

కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే పర్యటకులకు పూర్తి స్థాయిలో వంతెన అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రతి శని, ఆదివారాల్లో వాహనాలకు ప్రవేశం లేదని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘాను త్వరలోనే ఏర్పాటు చేస్తామని.. ఆ వ్యవస్థ ద్వారా పోలీస్​ కంట్రోల్​ కేంద్రం నుంచే పర్యటకలను నియంత్రించడం జరుగుతుందని వివరించారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో క్షమాభిక్ష కింద 141 మంది ఖైదీలు విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details