కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ.. ఏపీ స్కూటర్స్ లిమిటెడ్ కంపెనీ మాజీ ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 1994లో ఈ కంపెనీని మూసి వేయడం వల్ల 554 మంది ఉద్యోగుల్లో 278 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించగా.. మిగిలిన 276 మందికి ఎటువంటి ఉద్యోగం కానీ, రావాల్సిన బకాయిలు కానీ రాలేదని వారు వాపోయారు. ఫలితంగా తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఓపిక లేదు.. మాకు చనిపోవడానికి అనుమతివ్వండి' - latest news on some people meet hrc for Allow compassionate death
'కంపెనీని మూసివేయడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పటి నుంచి మాకు మరో ఉద్యోగం కానీ.. రావాల్సిన బకాయిలు కానీ రాలేదు. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కనీసం మా కారుణ్య మరణాలకైనా అనుమతివ్వండం'టూ ఏపీ స్కూటర్స్ లిమిటెడ్ కంపెనీ మాజీ ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
'పోరాడే ఓపిక లేదు.. కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'
276 మందిలో ఇప్పటికే 80 మంది మరణించారని.. మిగిలిన వారు చావుకు దగ్గరలో ఉన్నారని.. 26 ఏళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఈ వయసులో తమకు పోరాడే ఓపిక లేదని.. ఇక తమకు మరణమే శరణమని.. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ కమిషన్కు గోడు వెల్లబోసుకున్నారు.
ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు