30 శాతం ఫిట్‌మెంట్‌తో మే 1న ఏప్రిల్ వేతనాలు అందుతాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పీఆర్‌సీ అమలుకు అనుగుణంగా మార్గదర్శకాల విడుదలలో జాప్యంతో ఈ నెలకు పాత వేతనాలే అందనున్నాయి.
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలూ సోమవారం ఏప్రిల్ వేతనాలకు సంబంధించి బిల్లులను ట్రెజరీల్లో సమర్పించాయి. రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీ అమలుకు మార్గదర్శకాలు జారీ అయినా కొత్త వేతనాలు నిర్ధారించడం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి పీఆర్‌సీ సిఫారసులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఒక నెల ఆలస్యంగా అందుకుంటారు. అవి కూడా అంతకుముందు నెల బకాయిలతో పాటు ఉంటాయని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.