తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంత వర్షం కురిసినా... వరదలు రావొద్దంటే ఇలా చేయాలి - Nail holes

ఎక్కడి బొట్టు అక్కడే కట్టడి చేయాలి.. ఇంటిపై పడిన చుక్కలన్నీ చక్కగా సంపులోకి చేరాలి.. కాలనీ పార్కుకో ఇంకుడు కొలను, ఇంటికో ఇంకుడు గుంత, రోడ్డు పక్కన ఇంజెక్షన్‌ వెల్స్‌, బావులు, చెరువుల పునరుద్ధరణ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంపు రాకుండా ఇవే దారులంటున్నారు నిపుణులు. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తే గతేడాదిలాగా తిప్పలుండవంటున్నారు.

ముంపు సమస్య తీరాలంటే.. ఇవే దారులు!
ముంపు సమస్య తీరాలంటే.. ఇవే దారులు!

By

Published : Jul 23, 2021, 9:30 AM IST

అంతా వృథానే..!
ఏటా కురిసే వానల్లో 65% అంటే 600 మి.మీ. మేర నీరు వృథా అవుతున్నట్లు భూగర్భ జలశాఖ అంచనా. చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతాల్లో ఇది 40% మాత్రమే. అంత నీటిని కోల్పోతూనే, ముంపుతో తిప్పలు పడుతున్నాం. మరోవైపు నిజాంపేట, బోడుప్పల్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో 1500 అడుగుల లోతులో బోరుబావులు తవ్వి తోడుకుంటున్నాం.

ఇంకుడు గుంతలు నిర్మిస్తే..
నగర జనాభా 1,20,00000. రాజధానిలో భవనాల సంఖ్య 30 లక్షల దాకా ఉంటే ఇంకుడు గుంతలు 25 వేలు లేవని భూగర్భ జల శాఖ ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన అపార్ట్‌మెంట్లు, నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నిర్మాణం చేపట్టడంతో ఎక్కడి నీటిని అక్కడే ఇంకించి రోడ్డెక్కకుండా ఆపొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కృత్రిమ కొలనులతో..
హైటెక్‌ సిటీలో పునరుద్ధరించిన ఓ బావిలో గత అక్టోబరు వర్షాలప్పుడు 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగినట్లు ఓ సంస్థ తెలిపింది. ఇలాగే బావుల్ని, చెరువుల్ని పునరుద్ధరించి నీటిని ఇంకించాలి. లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనులు ఏర్పాటు చేసి, పార్కుల్లో భారీ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేస్తే వరదల్ని అరికట్టొచ్చు. 2 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చు.

ప్రభుత్వం.. ప్రజలు కలిస్తే..
పౌరులు బాధ్యతగా ఇంకుడు గుంతలు, ప్రభుత్వం తరఫున ఇంకుడు కొలనులు నిర్మించడం ద్వారా ముంపును అరికట్టి నీటిని నిల్వ చేయొచ్చు. అడవుల్లోలాగా సహజంగా ఇంకడం నగరంలో సాధ్యం కాదు అందువల్ల కృత్రిమ పద్ధతుల్లోనే కట్టడి చేయాలి. -గిరిధర్‌, భూగర్భ జల సంరక్షణ విభాగం, జేఎన్‌టీయూ

ఇదీ చదవండి:RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details