ఆంధ్రప్రదేశ్ విశాఖలో కరోనా యోధులకు రక్షణదళాలు సంఘీభావం ప్రకటించాయి. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందిపై పూల వర్షం కురిపించారు. విశాఖలోని టీబీ, ఛాతీ ఆస్పత్రులపై నౌకదళ హెలికాప్టర్లు పూలు చల్లాయి. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని నౌకదళ అధికారులు సన్మానించారు.
కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్ - pouring flowers by helicaptors
కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ విశాఖలో కరోనా నివారణకు పోరాడుతున్న వీరులకు రక్షణ దళాలు సంఘీభావం తెలుపుతూ.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాయి.
కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్
విశాఖ పోర్టులో నిలిపి ఉంచిన నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7.30 గంటల నుంచి 11.59 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముంబయి, విశాఖ, చెన్నై, కొచ్చిలోని నౌకలకు దీపాలంకరణ చేస్తారు.
ఇవీ చూడండి:కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం