దేశ సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులూ.. రైతు బిడ్డలే అని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక.. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. పుల్వామా ఘటనలో మృతి చెందిన అమరవీరులకు సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జోహార్లు తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అమరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
రైతు నిర్బంధాన్ని ఆపాలి
రైతులపై కొనసాగుతున్న నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ సవరణ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని సాగర్ కోరారు. రైతులు కోరిన విధంగా కనీస మద్దతు ధర ఇవ్వాలని, రుణ విమోచన చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఉద్యమంపై మోదీ ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని.. అక్రమ కేసులు బనాయించి శాంతియుత ఆందోళనను భగ్నం చేస్తోందని ఆరోపించారు. ఈనెల 18న జరిగే రైల్‌రోకో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి:గాంధీ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం