ఏపీలోని విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ ప్రతినిధులు సౌరవృక్షాన్ని తయారు చేశారు. సహజ వృక్షాన్ని పోలే విధంగా వొల్టాయిక్ సౌర ప్యానళ్లతో కాండం, కొమ్మలు, ఆకులను తీర్చిదిద్దారు. అత్యధిక సౌర వికిరణం జరిగేలా వీటిని అమర్చారు. ఈ అమరిక వల్ల అన్ని కాలాల్లో గరిష్ఠంగాా సౌర విద్యుత్తు సాధ్యమవుతుంది. ఈ విధానం వల్ల తక్కువ స్థలం ఉపయోగించుకుని ఎక్కువ సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని సంస్థ అధికారులు చెబుతున్నారు.
solar tree: ఈ చెట్టు.. వెలుగులు విరజిమ్ముతోంది - విశాఖలో సోలార్ వృక్షం
ఎన్నటికి తరగని అసాధారణ ఇంధనం సౌర శక్తి.. సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టాలంటే ఎకరాలకు ఎకరాల స్థలం కావాలి. అదీ విశాఖపట్నం లాంటి మహా నగరాల్లో కాస్త స్థలం దొరకడం గగనం.. దీనికి విశాఖ ఎన్టీపీసీ ప్రతినిధులు పరిష్కారం కనుగొన్నారు. కాస్త స్థలంలోనే అందంగా అమరేలా.. సోలార్ ప్యానళ్లతో సౌరవృక్షం తయారీ చేసి.. ఎన్టీపీసీ ప్లాంట్ వద్ద అమర్చారు. విద్యుదుత్పత్తిలో తనకు సాటిలేదని నిరూపిస్తోంది ఈ సౌరవృక్షం.
సమారు 3.3 కేడబ్ల్యూసీ సామర్థ్యం గల ఈ సౌరవృక్షాన్ని ఇటీవల సంస్థ జీజీఎం దివాకర్ కౌశిక్ ప్రారంభించారు. సాంకేతికత, రూపకల్పన నిర్మాణం పూర్తిగా సింహాద్రి ఎన్టీపీసీ ఇంజినీర్లు చేశారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ కంట్రోలు రూమ్, సందర్శకుల గదిలో దీపాలు, ఏసీలు, కంప్యూటర్, ఫ్యాన్లు తదితర పరికరాలు పని చేస్తున్నాయి. రాత్రి సమయంలో రంగురంగుల కాంతుల్లో దర్శనమిస్తూ చూపరులకు కనువిందు చేస్తోంది.
ఇదీ చూడండి:KTR: పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం... గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ప్రారంభం