తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్య గ్రహణం వేళ ఏం చేయాలి? ఏం చేయకూడదు.? - సూర్యాగ్రహణం వార్తలు

సూర్యగ్రహణం ఈసారి చూడమని యోగంలో వచ్చింది. ఇలా రావడం వల్ల ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు.? తదితర అంశాలపై ప్రముఖ జ్యోతిష్య పండితులు తేజస్వి శర్మతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

solar-eclipse-on-21-june-in-india
సూర్య గ్రహణం వేళ ఏం చేయాలి

By

Published : Jun 20, 2020, 4:14 AM IST

Updated : Jun 20, 2020, 9:42 AM IST

సూర్యగ్రహణం వేళ ఏం చేయాలి
  • సూర్యగ్రహణం ఈసారి చూడమని యోగంలో వచ్చింది. దీని విశిష్టత ఏమిటి?

చంద్ర గ్రహణం కన్నా సూర్య గ్రహణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం ఆదివారం ఏర్పడినా.. లేదా చంద్ర గ్రహణం సోమవారం ఏర్పాడితే చూడామని యోగంలో వచ్చిందని ధర్మ శాస్త్రం చెబుతోంది.

  • ఈ సూర్య గ్రహణం ఏఏ రాశులపై ఎటువంటి ప్రభావం చూపుతోంది?

ఈ గ్రహణం వల్ల మేష రాశి, సింహ రాశి, కన్య రాశి, మకర రాశి ఈ నాలుగు రాశుల వారికి మంచి జరుగుతుంది. వృషభ రాశి, తుల రాశి, ధనస్సు రాశి, కుంభ రాశి ఈ నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితం ఉంటుంది. మిథున రాశి, కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఈ నాలుగు రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది.

  • గ్రహణం రాజకీయ, ఆర్థిక రంగాలపై ఎటువంటి ప్రభావం చూపెడుతుంది?

సూర్య గ్రహణం వల్ల రాజకీయ, ఆర్థిక రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించదు.

  • సూర్య గ్రహణ ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది?

ఈ సూర్యగ్రహణం వల్ల భారత దేశానికి ఎలాంటి హాని సంభవించదు.

  • అంతర్జాతీయ సంబంధాలపై గ్రహణ ప్రభావం ఉంటుందా?

ప్రస్తుతం ఇబ్బందికర గ్రహస్థితి ఉంది. చాలా మంది మానసికంగా బాధపడుతుంటారు.

  • సూర్య గ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

గ్రహణం వచ్చే ముందు, గ్రహణం తర్వాత స్నానం చేయాలి.

  • గ్రహణంతో కరోనా తగ్గుతుందా?

గ్రహణానికి, కరోనాకు సంబంధం లేదు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

Last Updated : Jun 20, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details