కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి కూరగాయలు విక్రయిస్తూ.. వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) రాష్ట్ర నాయకత్వంలో చోటు దక్కించుకుంది. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన టీటా.. ఈ మేరకు తెలిపింది.
టీటాలో చోటు దక్కించుకున్న సాఫ్ట్వేర్ శారద - Software Sharada that got a place in Tita
కరోనా సమయంలో సాఫ్ట్వేర్ కొలువు పోగొట్టుకుంది. అయినా నిరాశ చెందకుండా కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించింది. ఆమె ఎవరో కాదు... సాఫ్ట్వేర్ శారద. ఇప్పుడు ఆమె తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) రాష్ట్ర నాయకత్వంలో చోటు దక్కించుకుంది.
టీటాలో చోటు దక్కించుకున్న సాఫ్ట్వేర్ శారద
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీటాకు ఆఫీస్ స్పేస్ కేటాయింపు జరగనుండటంతో సహా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణ కోసం ప్రణాళికలు రచించినట్లు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్లాల వెల్లడించారు. కరోనా సమయంలో ఉద్యోగం పోయిన క్రమంలో భవిష్యత్ సాంకేతికతలైన కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్ కోర్సులను నేర్పించి ఆదుకున్న టీటాకు శారద కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత కథనాలు: