తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాంసం పెట్టి మేపటం కాదు... నిందితులను వెంటనే ఉరితీయాలి' - JUSTICE FOR DISHA RALLY IN MADHAPUR

దిశ హత్యాచర ఘటనలో నిందితులకు మాంసాహారాలు పెట్టి మేపుతూ కాలాయాపన చేయకుండా వెంటనే ఉరితీయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహిచారు.

SOFTWARE EMPLOYEES AND DISHA FRIENDS, TEACHERS PROST RALLY AT HYDERABAD
SOFTWARE EMPLOYEES AND DISHA FRIENDS, TEACHERS PROST RALLY AT HYDERABAD

By

Published : Dec 3, 2019, 6:04 PM IST

దిశ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్​లోని మైండ్​స్పేస్ చౌరస్తాలో పలు కంపెనీలకు చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహించారు. ఫాస్ట్​ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్షించాలని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ శ్రీ సాయి విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి పద్మారావునగర్ పార్క్ వరకు వెయి మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. దిశ ఘటనలోని నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్​ చేశారు.

'మాంసం పెట్టి మేపటం కాదు... నిందితులను వెంటనే ఉరితీయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details