భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఖాజాగూడలోని స్వరూప రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కృష్ణకిశోర్, హిరణ్మయి దంపతులు. వీరు సాప్ట్వేర్ ఉద్యోగులు. తెనాలి ప్రాంతానికి చెందిన హిరణ్మయి... గుంటూరుకు చెందిన కృష్ట కిశోర్‌ను వివాహం చేసుకుంది. కిశోర్ 'ఎల్ అండ్ టీ'లో ఉద్యోగం చేస్తుండగా...హిరణ్మయి విప్రోలో పని చేస్తుంది. భర్త వేధింపులు, కుటుంబ తగాదాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లురాయదుర్గం సీఐ రవీందర్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య - భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య