తెలంగాణ

telangana

ETV Bharat / state

పార చేతపట్టి రోడ్డుపై గుంతలు పూడ్చిన ఏఎస్‌ఐ - Anantapur ASI Viral Video

Viral Video: మంచి పనులను ప్రోత్సహించడం కూడా గొప్ప విషయమే. చాలా మంది ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణతో పాటు తమ పరిధిలో చేస్తున్న సేవా కార్యక్రమాలు విశేషంగా ఆకర్షిస్తుంటాయి. వృద్ధులను రోడ్డు దాటించడం, యాచకులకు సాయం చేయడం, తమదైన శైలిలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటారు. అలాంటి వారిని, వారు చేస్తున్న మంచి పనులను రికార్డ్ చేసి సంబంధింత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంటాయి. ఏపీలో అనంతపురం నగర ట్రాఫిక్ ఏఎస్ఐ రామాంజనేయులు కూడా వారిలో ఒకరు.. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందామా..!

Anantapur District
Anantapur District

By

Published : Jan 19, 2023, 6:25 PM IST

Viral Video: ఒకపక్క విధులను కొనసాగిస్తూ.. మరోపక్క పార పట్టి గుంతల్లోకి మట్టి వేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఓ పోలీస్ అధికారి. వాహనదారులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచన, సామాజిక స్పృహతో మట్టితో గుంతలను పూడ్చాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లో రామాంజనేయులు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కల్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేటకు వెళ్లే సర్వీస్ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. దీనికి తోడు క్లాక్ టవర్ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే హైవే నిర్మాణం జరుగుతుండడంతో అటుగా వచ్చే వాహనాలన్నీ రుద్రంపేటకు వెలుతుంటాయి. దీంతో నిత్యం వాహనాల రద్దీతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఉండడంతో పోలీసులకు పెద్డ సవాల్​గా మారింది. వాహనాల రద్దీకి తోడు అక్కడ ఏర్పడిన గుంతలు వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారాయి.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రామాంజనేయులు ఇది గమనించి.. వృథా మట్టిని కంకరను కలిపి గుంతలను చదును చేశారు. దీనిని అటుగా వెలుతున్న ఓ వ్యక్తి.. ఏఎస్ఐ రామాంజనేయులు చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్​గా మారింది.

పార చేతపట్టి రోడ్డుపై గుంతలు పూడ్చిన ఏఎస్‌ఐ

ఇవీ చదవండి:ఆన్​లైన్​ బైక్​ ట్యాక్సీ యాప్స్​తో ఆఫీసుకే ఇంటిభో"జనం" బాట

ఏకంగా సెల్​ టవర్​నే చోరీ చేసిన దొంగలు.. నాలుగు నెలల తర్వాత..

ABOUT THE AUTHOR

...view details