తెలంగాణ

telangana

ETV Bharat / state

అశ్లీలమే అతగాడి ఆదాయానికి మార్గం - Social media cheating news

అందమైన అమ్మాయి నగ్న ఫొటో కావాలంటే ఒక రేటు.. వీడియో కావాలంటే మరో రేటు. డేటింగ్ యాప్​లో అశ్లీల ఆఫర్లు ప్రకటించాడు ఓ ప్రబుద్ధుడు. అమాయక అమ్మాయిల ఫొటోలను సామాజిక మాధ్యమాల నుంచి తస్కరిస్తాడు. డేటింగ్ యాప్​లో ఫొటోలు పెట్టి అబ్బాయిలకు వల వేస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ కేటుగాడు. ఈ కేసులో నిందితుడు అరెస్టు కాగా... ఈ తరహాలో ఏడాదిలో రూ. 20 లక్షల మేర సంపాదించాడని తెలియగా.. అవాక్కవడం పోలీసుల వంతైంది.

Social media fraud
సోషల్ మీడియా మోసగాడి అరెస్టు

By

Published : Mar 14, 2020, 5:58 AM IST

Updated : Mar 14, 2020, 7:56 AM IST

సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన కొద్దీ అదే స్థాయిలో మోసాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్​ మీడియాలో పెడుతున్న ఫొటోలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అడ్డదారుల్లో సంపాదనే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల చిత్రాలు ఇతర సైట్లలో పెట్టి వారికి నష్టం కలిగిస్తున్నారు.

ఇన్​స్టా ఫొటోలు.. డేటింగ్​ యాప్​లో..

విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేశ్‌ అనే వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు డేటింగ్‌ సైట్లలో పెట్టి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి తన ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన ఫొటోలు.. డేటింగ్‌సైట్‌లో ప్రత్యక్షమవగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు కాబోయే భర్త డేటింగ్‌ సైట్‌లో యువతి ఫొటోలు చూడగా.. పెళ్లి ఆగిపోయింది. ఆ సైట్‌లో తన పేరుతో చాటింగ్‌ చూసిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేశ్‌ను అరెస్టు చేశారు.

ఫొటో కావాలా? వీడియో కావాలా?

డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో ఉంటున్న వెంకటేశ్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తరచూ డేటింగ్ సైట్లు తనిఖీ చేసే ప్రబుద్ధుడు... అందమైన అమ్మాయిల ఫొటోలు ఇన్‌స్టాగ్రాం నుంచి డౌన్‌లోడ్‌ చేసి డేటింగ్ సైట్లలో పెట్టాడు. నగ్న ఫొటోలు పంపాలంటే ఒక ధర, నగ్నంగా వీడియో కాల్‌ చేయాలంటే మరో ధర అంటూ... డేటింగ్‌ వెబ్‌సైట్‌లోకి వచ్చే అబ్బాయిలకు వల వేస్తున్నాడు.

ఏడాదిలో రూ. 20లక్షలు..

ఆయా ఖాతాలకు తన ఫోన్ నెంబర్ పెట్టి వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటింగ్‌కి రావాలంటే డబ్బులు కట్టాలంటూ తన గూగూల్‌పే ఖాతాకు నగదు పంపాలని సూచించేవాడు. డబ్బులు పంపిన వెంటనే సదరు వ్యక్తి నంబర్‌ బ్లాక్‌ చేసేవాడు. ఇలా సంవత్సర కాలంలో రూ. 20 లక్షల సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Last Updated : Mar 14, 2020, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details