సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని సామాజిక కార్యకర్త సతీశ్ గుప్తా డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలో ఉన్న వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సతీశ్గుప్తా తెలిపారు. ఈ క్రమంలో నిరుపేదలు పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'కంటోన్మెంట్ నియోజకవర్గంలో కరోనా పరీక్షా కేంద్రాలు పెంచాలి' - corona cases in hyderabbad
హైదరాబాద్లో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పరీక్షా కేంద్రాలు పెంచాలని సామాజిక కార్యకర్త సతీశ్గుప్తా డిమాండ్ చేశారు. ప్రతి బస్తీ, కాలనీలో రోజువారీగా శానిటైజేషన్ చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సతీశ్గుప్తా కోరారు.
social activist sateesh guptha demanded for increase corona test centers
ప్రతి వార్డులో వెంటనే ఒక ఉచిత కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి బస్తీ, కాలనీలో రోజువారీగా శానిటైజేషన్ చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సతీశ్గుప్తా కోరారు.