నోటీసులు ఇవ్వకుండా రేషన్‌కార్డులు రద్దు చేశారని సామాజిక కార్యకర్త మసూద్ హైకోర్టుకు లేఖ రాశారు. లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది. లాక్‌డౌన్ వేళ రేషన్ కార్డు చూపితేనే ఉచిత బియ్యం ఇస్తున్నారని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో రేషన్‌కార్డు కోసం ఒత్తిడి చేయడమెందుకని హైకోర్టు ప్రశ్నించింది.
రేషన్‌కార్డుల రద్దు వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం
ఈ నెల8 లోగా పూర్తి వివరాలు తెలపాలి : హైకోర్టు
18:49 May 05
రేషన్‌కార్డుల రద్దు వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం
వారి బాధ్యత ప్రభుత్వానిదే...
వలస కూలీలు సహా పేదలకు నిత్యావసరాలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పేదలకు నిత్యావసరాలు అందించేందుకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 8లోగా పూర్తి వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!
Last Updated : May 5, 2020, 8:33 PM IST