ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కనుమదారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం ఉదయం వేళ ఒంపుల దారుల్లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య పాల సముద్రంలా మేఘాలు తేలియాడాయి.
తిరుమల కనుమదారిలో పొగమంచు హొయలు చూడతరమా! - తెలంగాణ వార్తలు
తిరుమల కనుమదారిలో ప్రకృతి, పొగమంచు నువ్వా నేనా అన్నట్టు అందాలను ఆరబోశాయి. పచ్చని కొండల్లో.. తెల్లని పొగమంచు చూస్తూ పర్యటకులు పరవశించిపోయారు.
![తిరుమల కనుమదారిలో పొగమంచు హొయలు చూడతరమా! snow at tirumala, tirumala snow beauty](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11311741-890-11311741-1617781365095.jpg)
తిరుమల కనమ దారిలో పొగమంచు అందాలు, తిరుమలలో పొగమంచు హొయలు
చేతికందేలా కనిపించిన పొగమంచు సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాలో బంధించి.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.
తిరుమల కనమ దారిలో పొగమంచు అందాలు, తిరుమలలో పొగమంచు హొయలు
ఇదీ చూడండి:యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం
Last Updated : Apr 7, 2021, 6:51 PM IST