తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణదానం... పాముకు ఆ సర్పం ఇలా జీవం పోసింది! - సర్పాన్ని మరొక సర్పం కాపాడుతున్న దృశ్యం

తోటివారికి సాయపడే గుణం మనుషుల్లోనే కాదు.. జీవుల్లోనూ ఉంటుంది. తమ సహచరులు ఆపదలో ఉంటే జంతువులూ స్పందిస్తాయి. ఎలాగైనా కాపాడుకోవాలని శతథా ప్రయత్నిస్తాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయ్యింది. తాజాగా ఒక పాము మరొక పాముని రక్షించుకుంటున్న దృశ్యం శ్రీకాకుళం జిల్లా ఉర్గాంలో జరిగింది.

పాము ప్రాణదానం

By

Published : Nov 5, 2019, 10:33 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్గాంలో చిత్రమైన సంఘటన జరిగింది. ఒక సర్పాన్ని మరొక సర్పం కాపాడుతున్న దృశ్యం కెమేరా కంటపడింది. ఉర్గాం సాయివీధిలో పోలాకి వెంకటరాజు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఒక నాగుపాము రాళ్లకింద చిక్కుకుని బయటకు రాలేకపోయింది. కొన్ని గంటలపాటు ఆ బండల కిందే ఉండిపోయింది. విషసర్పం అయినందున దాన్ని రక్షించేందుకు మనుషులు సాహసం చేయలేకపోయారు. అయితే.. తన మిత్రుణ్ని కాపాడుకునేందుకు మరో పెద్ద పాము వచ్చింది. రాళ్లకింద చిక్కుకున్న సర్పం తలను తన నోటిలో పెట్టుకుని కొంచెం కొంచెంగా బయటకు లాగింది. సుమారు గంటపాటు శ్రమించి తన సహచరున్ని రక్షించుకుంది. చుట్టూ జనాలు గుమిగూడినా ఏమాత్రం బెదరకుండా స్నేహితున్ని కాపాడుకుంది.

పాము ప్రాణదానం

ABOUT THE AUTHOR

...view details