హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ సృష్టించింది. ఫుట్ పాత్ వద్ద ఉన్న చెట్ల నుంచి పాము రోడ్ పైకి వచ్చింది. కాసేపు రోడ్‌పై ఉండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే గమనించిన ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు తెలియజేశారు. వారు వచ్చి పామును పట్టుకుని బాల్కంపేట చెట్ల పొదల్లో వదిలేశారు.
మహానగరంలో విషనాగు... భయాందోళనలో ప్రజలు - నాగుపాము
బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ చేసింది. రోడ్డుపై పామును చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్