ఆంధ్రప్రదేశ్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున పొగలు రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ప్లాంట్ నుంచి పొగలు రావడంతో పక్కన ఉన్నవారు ఆందోళనకు గురై అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్లో పొగలు.. స్థానికుల్లో ఆందోళన - కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి
ఆదివారం రాత్రి ఒక్కసారిగా పొగలు రావడం ఏపీలోని కర్నూలు ప్రభుత్వం ఆస్పత్రిలో కలకలం రేపింది. ఆక్సిజన్ ప్లాంట్ నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది...నీళ్లతో పొగలను అదుపు చేశారు.

ఆ ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్లో పొగలు.. స్థానికుల్లో ఆందోళన
అప్రమత్తమైన సిబ్బంది నీళ్లతో పొగలను అదుపు చేశారు. ఆక్సిజన్ వాడకం ఎక్కువగా ఉన్నందునే పొగలు వచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత