Smart Phone Effect on human: హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె వంటి మెట్రోనగరాల్లో ‘మానవ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం’ అంశంపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 1,100 మందిని ప్రశ్నించగా కుటుంబ సంబంధాలపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉందని ఎక్కువ మంది అంగీకరించారు. కొవిడ్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. నలుగురు మనుషులు ఉన్న ఇల్లు ఒకప్పుడు ఆనందాలతో, కేరింతలతో సందడి, సందడిగా మారిపోయేది. కష్టసుఖాలతోపాటు, భవిష్యత్తు పరిణామాల గురించి చర్చిస్తూ, సరదాగా గడిపేవారు. ప్రస్తుతం పక్కపక్కన కూర్చున్న పలకరించడానికి సమయం లేనంత హడావుడిగా మారిపోయామని ముఖ్యంగా పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బంధాలు సరిగా ఉండటం లేదని తెలిపారు.
Smart Phone Effect on human: బంధాలను దూరం చేస్తోన్న స్మార్ట్ ఫోన్ - Cyber media report
Smart Phone Effect on human: స్మార్ట్‌ఫోన్.. రోజురోజుకు మనిషి జీవితాన్ని స్వాహా చేస్తోంది. తిండి లేకున్నా, నీరు తాగకున్నా, బంధాలు, బంధుత్వాలు దూరమవుతున్నా మొబైల్‌ను మాత్రం వదలలేనంతగా పెనవేసుకుపోయింది. చరవాణి పాడైనా.. మరమ్మతులకు గురైనా ఏదో కోల్పోయిన వెలితి. ఒక్క క్షణం, ఒక్క నిమిషం కనబడకుంటే జీవితమే ఆగిపోయినట్లుగా, అంతా కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. అరచేతిలో మంత్రదండంగా మారిన స్మార్ట్‌ఫోన్ వ్యక్తుల జీవితాలను, కుటుంబ బంధాలను పాతాళానికి తొక్కేస్తోందని సైబర్ మీడియా పరిశోధనలో వెల్లడైంది.

Smart Phone Effect on human: బంధాలను దూరం చేస్తోన్న స్మార్ట్ ఫోన్