తెలంగాణ

telangana

ETV Bharat / state

భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం - slot bookings in dharani portal

భూముల రిజిస్ట్రేషన్​ కోసం ధరణి పోర్టల్​లో స్లాట్ల బుకింగ్​ విధానం ప్రారంభమైంది. కొందరు స్లాట్లు బుక్​ చేసుకున్నారు.

slot bookings started in dharani portal in telangana
భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం

By

Published : Oct 31, 2020, 5:49 AM IST

భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభమైంది. వెబ్‌సైట్‌లో మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకునే ఆప్షన్‌ అవకాశం లేక.. నిన్న సాయంత్రం వరకు స్లాట్ బుకింగ్స్ కాలేదు. కొత్త మొబైల్ నెంబర్‌ను ధరణి పోర్టల్ లో నమోదు చేసుకునే సైన్‌-అప్ ఆప్షన్ అందుబాటులోకి రావటంతో.. కొందరు స్లాట్లు బుక్ చేసుకున్నారు.

అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పది స్లాట్లు బుక్ అయినట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచే ప్రారంభం అవుతున్న తరుణంలో అదే రోజు వారికి సమయం కేటాయించారు.

ఇవీ చూడండి: రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details