తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు రోజుల్లో మంచి స్పందన.. ఖజానాకు రూ.32 కోట్లు - వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం స్లాట్​ బుకింగ్​

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ కొనసాగుతుంది. స్లాట్‌ బుకింగ్‌ విధానానికి మంచి స్పందన వస్తోందని ప్రభుత్వం తెలిపింది. శనివారం సాయంత్రం వరకు 10,509 స్లాట్లు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

slot booking Good response in two days Rs 32 crore to the treasury in telangana
రెండు రోజుల్లో మంచి స్పందన.. ఖజానాకు రూ.32 కోట్లు

By

Published : Dec 13, 2020, 4:07 AM IST

వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం స్లాట్ బుకింగ్‌లకు మొదటి రెండు రోజుల్లో మంచి స్పందన లభించింది. ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే 48 స్లాట్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 10,509 స్టాట్లు నమోదయ్యాయి.

మరో 620 స్లాట్లు నమోదు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని ద్వారా సర్కారు ఖజానాకు 32 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏడు ప్రధాన రకాల లావాదేవీలకు స్లాట్ నమోదు సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 16 రోజుల్లో అదనంగా 16 రకాల లావాదేవీలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి :'మెజార్టీ అభిప్రాయం కాదు... ఏకాభిప్రాయం సాధించాలి'

ABOUT THE AUTHOR

...view details