BJP Change Mandal Presidents In Telangana : హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తతల పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అర్వింద్ తీరును నిరసిస్తూ.. నిజామాబాద్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలో బైఠాయించి కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
Nizamabad MP Arvind : మండల అధ్యక్షులను మార్చడంపై.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేక నినాదాలు - అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు
14:28 July 26
Nizamabad MP Arvind : ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఎంపీ అర్వింద్‌నే ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలకు అర్వింద్ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మార్చిన మండల అధ్యక్షులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
"బోధన్ నియోజకవర్గంలో నలుగురు బలమైన మండల అధ్యక్షులను మార్చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ఈ నలుగురు దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి.. పార్టీకి ఎనలేని సేవలు చేశారు. జిల్లా ఇంఛార్జి వ్యతిరేకించిన, ఉన్నత స్థాయి నేతలు ఎవరికీ సమాచారం లేకుండా ఎంపీ అర్వింద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడం కోసం నిజామాబాద్ ఉన్న ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే మండల అధ్యక్షుల మార్పిడిని విరమించుకోవాలి."- నిజామాబాద్ బీజేపీ నేతలు
ఇవీ చదవండి :