దేశంలో సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను తక్షణమే ఉరి తీయాలని పలు విద్యార్థి సంఘాలు చర్లపల్లి జైలు వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలు ముందు బైఠాయించి నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.
చర్లపల్లి జైలు ఎదుట పలు విద్యార్థి సంఘాల నిరసన - చర్లపల్లి జైలు వద్ద క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.
దిశ అత్యాచారం ఘటనలో నిందితులను తక్షణమే ఉరి తీయాలని పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు వద్ద ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు జైలు ముందు బైఠాయించి నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.
![చర్లపల్లి జైలు ఎదుట పలు విద్యార్థి సంఘాల నిరసన slogans-about-hanging-out-in-front-of-the-prison-at-cherlapally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5271701-181-5271701-1575483102814.jpg)
జైలు ముందు బైఠాయించి ఉరి తీయాలంటూ నినాదాలు
ర్యాలీకి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య తొపులాట చోటుచేసుకుంది. విద్యార్థులు జైలు మెయిన్ గేటు ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
చర్లపల్లి జైలు ఎదుట పలు విద్యార్థి సంఘాల నిరసన
ఇదీ చూడండి : రెండేళ్లయినా తీర్పు అమలు చేయకపోవటంపై హైకోర్టు ఆగ్రహం