రాష్ట్రంలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. జూన్‌తో పోల్చితే జులైలో 6.4 శాతం తగ్గి నిరుద్యోగ రేటు 9.1శాతంగా నమోదైంది. రాష్ట్రాలవారీగా నిరుద్యోగ గణాంకాలను భారత ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రేటు 3.56 శాతం తగ్గింది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నిరుద్యోగ రేటు భారీగా తగ్గింది. వ్యవసాయ పనులతో ఉపాధి అవకాశాలు పెరుగుతోండటమే ఇందుకు కారణమవుతోంది. అదే సమయంలో పట్టణాల్లో నిరుద్యోగ రేటులో రికవరీ నెమ్మదిగా ఉంటోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, వ్యాపారాలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండటమే ఇందుకు నేపథ్యం. జులైలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.15శాతంగా ఉంటే.. గ్రామాల్లో 6.66శాతంగా నమోదైంది.
స్వల్పంగా తగ్గినా...