'స్కల్ బ్రేకర్ ఛాలెంజ్'తో యూత్ బీ కేర్‌ఫుల్ మీకు బ్లూవేల్ గేమ్ గుర్తుందా..? ఆ ఆట అంతర్జాలన్నే అల్లాడించింది. చేతిమీద తిమింగలం బొమ్మ గీయించుకుని... చివరికి ఆటగాడి మృతితో ఆట ముగిసేది. దేశంలో చాలా మంది పిల్లలు, యువకులు ఈ ఆట ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చింది కీకీ ఛాలెంజ్. దాదాపు ఇది కూడా అలాంటిదే.
సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్
ఇప్పుడు తాజాగా ఎముకలు విరగ్గొట్టుకునే ఛాలెంజ్ నెట్లో వైరల్ అవుతోంది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ ఛాలెంజింగ్ స్టంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువత ఈ ఛాలెంజ్ భారిన పడే అవకాశముందని తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
అసలు ఏంటీ ఈ స్కల్ బ్రేకర్?
స్కల్ బ్రేకర్ ఇప్పుడు ఇదోక ప్రమాదకర ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. మధ్యలో వ్యక్తి గాల్లో ఎగిరినప్పుడు చెరోవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిన వ్యక్తి కాళ్లని కొడతారు. గాల్లో ఎగిరిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవాలి లేకపోతే నేలమీద పడిపోతాడు. అలా నేల మీద పడినప్పుడు తల పగిలే అవకాశముంటుంది. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కువగా స్కూలు పిల్లలు ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై తగు సూచనలు తెలిపారు.
ఏం చేయాలంటే?
పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఈ ఛాలెంజ్‌ల పట్ల విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తరహా ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియోలు తీసినా, ప్రచారం చేసినా చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. ఈ విషయమై సాయం కావాలంటే 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444 నంబర్‌కు వాట్సాప్ చేయమని సూచించారు.
ఇవీ చూడండి:పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్