తెలంగాణ

telangana

ETV Bharat / state

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష - జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష

2021 జనాభా లెక్కలకు సంబంధించిన ముందస్తు పరీక్ష రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఆగస్టు12 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరగనుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచించారు.

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష

By

Published : Jul 6, 2019, 5:28 AM IST

Updated : Jul 6, 2019, 7:44 AM IST

మహబూబ్​నగర్, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో జనాభా లెక్కలకు సంబంధించి ముందుస్తు పరీక్ష జరగనుందని... దీనిపైఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్​ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు మండలం, మహబూబ్​నగర్ జిల్లాలోని నవాబ్ పేట్​, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రీటెస్ట్ నిర్వహిస్తున్నట్ల వెల్లడించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష
ఆలస్యం వద్దు:
2021 జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఉత్తర్వులు జారీచేశామని... 14 జిల్లాల్లోని 58 మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు, పట్టణాల వివరాలు నోటిఫికేషన్​లో గల్లంతయ్యాయని.. వీటి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల వివరాలను 2011 మాస్టర్ డైరెక్టరీ, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లిస్ట్, పంచాయతీ రాజ్ లిస్ట్, మాస్టర్ డెరెక్టరీ 2011 సెన్సెస్​లతో సరి పోల్చుకుని వివరాలు పంపాలని సూచించారు. ఇప్పటివరకు 589 మండలాలకు సంబంధించిన గ్రామ రిజిష్టర్లను 167 మంది తహసీల్దార్లు, 142 మున్సిపాలిటీలకు గానూ 30 పట్టాణాల రిజిష్టర్లు పంపారని తెలిపారు. పట్టణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల వివరాలను కలెక్టర్లు వెంటనే పంపించాలని ఆదేశించారు.
Last Updated : Jul 6, 2019, 7:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details