ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో.. కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి.. మొత్తం కేసుల సంఖ్య 2787కు చేరింది. కొవిడ్ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 58కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9664 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... వారిలో 68 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీ కరోనా లెటెస్ట్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,787కు చేరింది. ఇప్పటివరకు 1,913 మంది కోలుకుని డిశ్చార్జికాగా... 816 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు 1913 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. 816 మంది బాధితులు వివిధ ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
ఇదీ చదవండి :దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు