తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

హైదరాబాద్​ హస్మత్​పల్లిలో విషాదం చోటుచేసుకొంది. టిప్పర్​ బ్రేకులు విఫలమై.. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి నిండు ప్రాణాన్ని చక్రాలతో తొక్కేసింది.

చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

By

Published : Jun 23, 2019, 3:12 PM IST

చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

హైదరాబాద్​ బోయిన్​పల్లి హస్మత్​పేట్​లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని టిప్పర్​ రూపంలో మృత్యువు బలితీసుకుంది.

హస్మత్​పేట్​లో కంకరతో వెళ్తున్న టిప్పర్​ బ్రేక్​లు విఫలమై.. ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపైనుంచి దూసుకొచ్చింది. టిప్పర్​ వెనుకనే ఉన్న టాటా ఏసీ వాహనాన్ని, విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్​ పరారయ్యాడు. ప్రమాదానికి డ్రైవర్​ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: పదోతరగతి బాలికపై పదిరోజులుగా కీచకపర్వం

ABOUT THE AUTHOR

...view details