Six People Suicides in One Day in Hyderabad : హైదరాబాద్‌లోని బోరబండ రాజ్‌నగర్‌లో తల్లి, ఇద్దరు కుమారుల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేస్తున్న విజయ్, తన భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఆదిత్య, అర్జున్‌తో కలిసి నివసిస్తున్నాడు. జ్యోతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే పెద్ద కుమారుడు ఆదిత్య సరిగా నడవలేకపోవడం, చిన్న కుమారుడు అర్జున్‌కు మాటలు రాకపోవడం ఈ రెండు పరిణామాలతో ఆమె మానసిక వేదనకు గురయ్యేదని కుటుంబసభ్యులు తెలిపారు.
Mother and Two Sons Commit Suicide in Borabanda : దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి తన ఇద్దరు కుమారులకు పాలలో విషం కలిపి ఇచ్చి.. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Commit Suicide) పాల్పడింది. తల్లి, ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండగా బంధువులు గమనించి ఇతర కుటుంబసభ్యులకు, భర్తకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకుని చూసే సరికి అప్పటికే వారు ముగ్గురు మృతి చెందారు. జ్యోతి భర్త విజయ్.. భార్య కుమారులు మృతదేహాలను చూసి తాను కూడా విషం తాగాడు. దీంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శోకసంద్రంలో మునిగిపోయిన విజయ్‌ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
Wife And Husband Suicide In Medak : కుటుంబ కలహాలతో భార్య.. కాపాడపోయి భర్త..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన స్థానికులు, కుటుంబ సభ్యలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో రాజ్‌నగర్‌లో విషాధచాయలు అలుముకున్నాయి. అయితే అంతకు ముందు పోలీసులు దీని వెనుక ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే కుమారుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడితో.. తల్లి జ్యోతి కుమారులకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Father and Two Daughters Commit Suicide Bowenpally : మరో ఘటనలో ఆర్థిక సమస్యల కారణంగా తలెత్తిన కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడ్సిన తండ్రి ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి (Bowenpally) పీఎస్ పరిధిలోని భవానీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెండి వస్తువులు తయారు చేసేశ్రీకాంతాచారి, తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సికింద్రాబాద్‌లో అద్దె దుకాణంలో వెండి వస్తువులు తయారు చేసి విక్రయించేవాడు. ఈ క్రమంలో 24 ఏళ్ల క్రితం అతని ఎడమ చేతి తెగి పోయింది. ఆ తర్వాత ఒక చేతితోనే తన వృత్తి పనులు చేసేవాడు.