ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆరుగురు నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి , తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బండ ప్రకాశ్, పాడి కౌశిక్ రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డి శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఉదయం 11 గంటలకు నూతన ఎమ్మెల్సీలతో తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
MLC's Oath today: నేడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణం - telangana varthalu
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు నేతలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిచే శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు.
MLC's Oath today: నేడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణం