తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరునెలల పిల్లాడు... అదరగొట్టేశాడు! - వాటర్​ స్కీయింగ్​ చేసిన ఆరునెలల పిల్లాడు

నీళ్ల మీద తేలుతూ చేసే వాటర్‌ స్కీయింగ్‌ పెద్దవాళ్లకే కష్టమైన స్పోర్ట్‌. ఎందుకంటే నీటి తాకిడికి అనుగుణంగా కదులుతూ కిందపడిపోకుండా బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ఆరు నెలల బుడ్డోడు స్కీయింగ్‌లో అదరగొట్టేశాడంటే నమ్మండి!

six months boy richi hampres water skiing in america
ఆరునెలల పిల్లాడు... అదరగొట్టేశాడు!

By

Published : Nov 1, 2020, 2:12 PM IST

అమెరికాకు చెందిన ఈ బుజ్జిగాడి పేరు రిచీ హంప్రెస్‌. వీడు పుట్టగానే తన పేరు మీద అమ్మానాన్నలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా తెరిచారు. అప్పటినుంచీ రిచీ గురించిన ప్రతి విషయాన్నీ, తను చేసే అల్లరి పనులనూ పోస్ట్‌ చేస్తున్నారు. అవన్నీ నెటిజన్లకు బాగా నచ్చేయడంతో మనోడికి ఫ్యాన్స్‌ కూడా పెరిగిపోయారు.

తాజాగా రిచీ వాళ్ల అమ్మానాన్నలు తనతో నదిలో వాటర్‌ స్కీయింగ్‌ చేయించారు. బోటుకు తాడుకట్టి, రిచీ నిలబడేందుకు వీలుండేలా లైఫ్‌ జాకెట్‌ తొడిగి, కాళ్లకు బెల్టులు కట్టారు. తన పక్కనే మరో బోటులో వాళ్ల నాన్న ప్రయాణిస్తూ జాగ్రత్తగా చూసుకున్నాడులెండి. ఇక ఆ నీళ్లలో బోటు స్పీడుగా వెళ్తుంటే... ఈ చిన్నోడి కేరింతలకు లెక్కే లేదు!

ఇదీ చూడండి:అతడు ముగ్గు వేస్తే ఫొటో తీసినట్టే!

ABOUT THE AUTHOR

...view details