చేతి తొడుగులు అమ్ముతానంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీర్‌కు రూ.6.50 లక్షల టోకరా వేశాడు సైబర్ నేరగాడు. బేగంపేట్‌కు చెందిన ముహమ్మద్ యూనుస్ స్ట్రక్చరల్ ఇంజినీర్. కరోనా నేపథ్యంలో పని ప్రదేశంలో వినియోగానికి ప్రత్యేకమైన చేతి తొడుగులు ఏమైనా ఉన్నాయా.. అని ఇండియామార్ట్ సైట్‌లో వెతికారు.
గ్లౌజులు అమ్ముతానంటూ.. రూ.6.50 లక్షలు టోకరా
హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీర్ చేతి తొడుగుల కోసమని ఇండియామార్ట్ సైట్‌లో వెతికాడు. ఆ సైట్‌లో రూ. 6.50 లక్షల చేతి తొడుగులకు ఆర్డర్ ఇచ్చాడు. డబ్బులను ముందుగానే పంపించాలని సంస్థ యజమాని చెప్పాడు. దీంతో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించాడు.
ఒక సంస్థలో అలాంటి వస్తువును గుర్తించి.. వెంటనే ఆ సంస్థ యజమానితో మాట్లాడారు. దాదాపు రూ.6.50 లక్షల విలువ చేసే చేతి తొడుగులకు ఆర్డర్ ఇచ్చారు. ఆ మొత్తాన్ని ముందుగానే పంపించాలని ఆ సంస్థ యజమాని చెప్పాడు. దీంతో ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ యజమాని ఫోన్ స్పందించడం మానేసింది. తాను మోసపోయినట్లు గ్రహించిన యూనుస్.. హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్