తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదల్లో కోట్లు విలువ చేసే విల్లాలు - వరద నీటిలోనే విల్లా

భారీ వర్షాలతో హైదరాబాద్​ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండలో విల్లాలు ఇప్పటికీ వరదనీటిలోనే ఉన్నాయి. ఒక్కొక్క విల్లా ధర రూ.6 కోట్లు. అధికారులు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

six crore rupees villa in flood in hyderabad
ప్రకృతి ముందు ఎంతటి వారైనా అంతే

By

Published : Oct 16, 2020, 7:27 PM IST

హైదరాబాద్​ మణికొండలో విల్లాలు వరదలో చిక్కుకున్నాయి. అధికారులు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రైల్స్​ విల్లాలను అంబియన్స్​ ప్రాపర్టీస్​ వారు నిర్మించారు. ఇందులో ఒక్కొక్క విల్లా ధర రూ.6 కోట్లుగా ఉంది. మొన్నటి వరకు అత్యంత ఖరీదైన విల్లాలుగా పేరుగాంచిన ఆ ప్రాంతం ఇప్పుడు వరదనీటితో నిండిపోయింది.

నడుములోతు నీళ్లలో విల్లాల వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పడవుల ద్వారా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని విల్లావాసులు తెలిపారు. కార్లు, ఖరీదైన ఇంటి సామాగ్రి నీళ్లలో తడిచి పనికి రాకుండా పోయాయని చెబుతున్నారు.

ప్రకృతి ముందు ఎంతటి వారైనా అంతే

ఇదీ చదవండి:బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్

ABOUT THE AUTHOR

...view details