తెలంగాణ

telangana

'రెరా వల్ల మరింత సందిగ్ధంలో పడ్డాం'

By

Published : Aug 24, 2019, 7:44 PM IST

ఆఫీసు స్థలం విషయంలో బెంగళూరును హైదరాబాద్‌ దాటేస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.  ఇటీవల ఒక సమావేశంలో కేటీఆర్‌ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేశారు. వాణిజ్య స్థిరాస్తి రంగం దూసుకెళ్తున్నప్పటికీ నివాస రంగానికి సంబంధించి మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేదన్నది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భాగ్యనగరంలో గృహాల రేట్లు పెరగడానికి కొత్త ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడమే కారణమంటున్నారు నిపుణులు.

రెరా వల్ల మరింత సందిగ్ధంలో పడ్డాం

భాగ్యనగరంలో గృహాల రేట్లు పెరగడానికి గతంలో స్థిరాస్థి రంగంలో నెలకొన్న ప్రతికూలతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. 2009-15 మధ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్​లోని ప్రతికూలతల వల్ల స్థిరాస్తి డెవలపర్లు సందిగ్ధంలో పడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేదు. దాని తర్వాత రెరా వచ్చినందున మళ్లీ కొంతకాలం సందిగ్ధంలో పడ్డామని హైదరాబాద్​ రియల్టర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సుమంత్​ రెడ్డి అరానీ అభిప్రాయపడ్డారు. ఈ కారణాల వల్ల కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోవడం వల్లే కొనుగోళ్లు తగ్గిపోయాయంటున్నహైదరాబాద్​ రియల్టర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు సుమంత్​ రెడ్డి అరానీతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

రెరా వల్ల మరింత సందిగ్ధంలో పడ్డాం

ABOUT THE AUTHOR

...view details