వైఎస్ వివేకా హత్యపై.. ఆయన కూతురు సునీత తొలిసారిగాస్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న దర్యాప్తు తీరు... ఘటనపై రాజకీయనాయకులు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై మాట్లాడారు. వివేకాను అవమానించేలా మాట్లాడొద్దని నాయకులను కోరారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ దిశగా చాలా శ్రమిస్తోందని.. ఈ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయ్యేలా నాయకులు, పార్టీలు సంయమనంపాటించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆరోపణలు విచారణను ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు.మరోవైపు.. తమకు సిట్ నుంచి ఎలాంటి నివేదిక అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ, సిట్... దర్యాప్తు ఎవరు చేసినా సరే.. వాస్తవాలు బయటపడాలని ఆకాంక్షించారు.తన తండ్రిని ఎవరు చంపారు.. ఎందుకు చంపారన్నది తెలియాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
సిట్‌ను పని చేసుకోనివ్వండి: వైఎస్ వివేకా కుమార్తె - వివేకానంద రెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను.. వివేకా కుమార్తె సునీత తప్పుబట్టారు. వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం చాలా శ్రమిస్తోందని చెప్పారు. విచారణ పారదర్శకంగా కొనసాగేలా చూడాలని కోరారు.
వివేకా హత్యకేసు