హైదరాబాద్ సీతాఫల్మండి డివిజన్ తెరాస అభ్యర్థి సామల హేమ ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, అన్ని వర్గాల వారు ఓటు వేస్తామని చెప్పారని తెలిపారు.
ప్రజల మద్దతు తమకే ఉంది: తెరాస అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
ప్రజల మద్దతు తమకే ఉందని సీతాఫల్మండి డివిజన్ తెరాస అభ్యర్థి సామల హేమ అన్నారు. ఆమె డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రజల మద్దతు తమకే ఉంది: తెరాస అభ్యర్థి
సీతాఫల్మండిలోని డంపింగ్ యార్డ్ విషయంలో ఇతర పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డంపింగ్ యార్డు నిర్మాణం జరగబోదని ఆమె స్పష్టం చేశారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్