MLAs Purchase Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
'ఎమ్మెల్యేల ఎర కేసు'.. నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ - పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు
MLAs Purchase Case Updates: 'ఎమ్మెల్యేల ఎర కేసు'లో ముగ్గురు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు పిటిషన్లో కోర్టుకు తెలియజేశారు. నిందితులను రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన సమాచారం సేకరించలేకపోయామని మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది.
MLAs Purchase Case
ఇప్పటికే నిందితులను రెండురోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో వారం రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో మంగళవారం కౌంటరు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ వాదనలు వింటామని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 23, 2022, 6:20 AM IST