తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC లీకేజీలో 15కు చేరిన అరెస్ట్​లు.. ప్రవీణ్‌ ఇంట్లో రూ.5 లక్షలు స్వాధీనం

TSPSC question paper leakage case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ కేసు విషయంలో 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సిట్​ అధికారులు తెలిపారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు మండలానికి చెందిన తిరుపతిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

By

Published : Mar 27, 2023, 5:49 PM IST

Updated : Mar 27, 2023, 7:52 PM IST

TSPSC question paper leakage case
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసు

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ కేసులో 15కి చేరిన నిందితుల సంఖ్య

TSPSC question paper leakage case: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కలకలం రేపుతున్న టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ కేసులో రోజుకో ఒక విషయం బయటపడుతుంది. తాజాగా ఈ కేసులో తిరుపతిని అరెస్ట్ చేసినట్లు సిట్​ అధికారులు చెప్పారు. దీంతో అరెస్ట్​ చేసిన నిందితుల సంఖ్య 15కు చేరుకున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రధాన నిందితురాలు రేణుక భర్త డాక్యా ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం పొందినట్లు అధికారులు గుర్తించారు. ప్రశాంత్​ గ్రూప్​-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్​ పేపర్​ను రాజశేఖర్ ద్వారా పొందాడు. దీంతో తాను న్యూజిలాండ్​ నుంచి వచ్చి పరీక్ష రాశాడు. అతనికి లుకౌట్​ నోటీసులు జారీ చేసినట్టు సిట్​ పేర్కొంది.

ప్రవీణ్​ ఇంట్లో రూ.5 లక్షలు స్వాధీనం: టీఎస్​పీఎస్​సీ మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్​ ఇంట్లో అధికారులు రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా.. శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్‌వర్డ్ చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణ చేశారు. దీంతో కంప్యూటర్​లో ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సిట్​ అధికారులు వెల్లడించారు.

నిందితుల మధ్య పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి:ఈ కేసును అధికారులు విచారణ చేసినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకి వస్తుంది. నిందితులు ఒకరి తరవాత ఒకరు బయటపడుతున్నారు. చివరికి ఈ కేసులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో సిట్ అధికారులు ఇంతక ముందు 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఈ, సివిల్‌ ప్రశ్న పత్రం కొనుగోలు చేసినట్టు ఆధారాలు దొరకడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంకి చెందిన రాజేందర్‌ కుమార్‌ను సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజేందర్‌ కుమార్‌.. మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేసేవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు డాక్యా నాయక్, తిరుపతయ్య పరిచయం అయ్యారు.

ఈ కేసులో నిందితులుగా ఎవరు ఉన్న వదిలేది లేదని అధికార పార్టీ నాయకులు పలువురు తెలిపారు. రద్దు చేసిన పరీక్షలన్ని త్వరలోనే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దని.. వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 27, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details