SIT Notice to YCP MP Raghurama : ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈనెల 29న హాజరు కావాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. వారితో పాటు సిట్ అధికారులు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు - ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు
11:47 November 24
SIT Notice to YCP MP Raghurama : ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు
MLAs poaching case update : ఈ కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని న్యాయవాది ప్రతాప్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రతాప్‌ను అరెస్టు చేయొద్దని సిట్ అధికారులను ?ఆదేశించింది. నిందితుడు, అనుమానితుడు కానప్పటికీ 41ఏ నోటీసు ఇచ్చారని పిటిషనర్ తెలిపారు. కారణాలు ఉన్నందునే న్యాయవాది ప్రతాప్‌కు నోటీసు ఇచ్చినట్లు సిట్ పేర్కొంది.
MLAs poaching case latest news : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎంతో కీలకమైన ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.ఇప్పటికే నిందితులను రెండురోజులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ సరైన సమాచారం సేకరించలేకపోయామని, మరో ఐదు రోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. పోలీసుల పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను నాంపల్లి కోర్టు ఆదేశించడంతో మంగళవారం కౌంటరు దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇవాళ కస్టడీ పిటీషన్‌పై తుది తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది.
మరోవైపు శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్ అధికారులు సింహయాజీతో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ వివరాలు అడిగారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్‌హౌస్‌లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్తోనూ శ్రీనివాస్‌కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్ నేడు మరోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన వివరాలతో విచారణకు హాజరయ్యారు.