తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2023, 7:30 PM IST

ETV Bharat / state

TSPSCకి నివేదిక ఇవ్వనున్న సిట్‌.. నిందితుల కస్టడీ పిటిషన్ వాయిదా!

SIT Investigation In TSPSC Paper Leakage: పేపర్ లీక్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులు.. కీలక అంశాలను గుర్తించారు. ఈ మేరకు సిట్‌ అధికారులు.. రేపు టీఎస్‌పీఎస్సీకి నివేదిక ఇవ్వనున్నారు. నిందితుల కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

tspsc paper leak
tspsc paper leak

SIT Investigation In TSPSC Paper Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సుమారు 2 గంటలపాటు సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని నేర విభాగ అదనపు సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ప్రశ్నాపత్రం లీకైన సెక్షన్‌లో వివరాలు సేకరించిన అధికారులు.. ఎన్ని పేపర్లు లీక్‌ అయ్యాయి అనే కోణంలో విచారణను ప్రారంభించారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ క్యాబిన్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. దర్యాప్తులో భాగంగా కార్యాలయంలోని పలువురి కంప్యూటర్లను సిట్‌ అధికారులు పరిశీలించారు.

ఈ విషయంపై టీఎస్‌పీఎస్సీకి రేపు నివేదిక ఇవ్వనున్నట్లు సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మీ కంప్యూటర్‌తో పాటు.. ఛైర్మన్‌, కార్యదర్శి కంప్యూటర్లను సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. ఛైర్మన్‌, కార్యదర్శి పేషీల్లోని సిబ్బంది వివరాలను సిట్‌ చీఫ్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్‌తో ఎక్కువగా ఎవరెవరు కలిసి ఉంటారనే విషయాలపై ఎక్కువగా సిట్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కార్యాలయంలోని సాంకేతిక నిపుణుల నుంచి టీఎస్‌పీఎస్సీ సర్వర్ల వివరాలను సైతం అడిగి తెలుసుకుని విచారించారు.

TSPSC Paper Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో ప్రథమం అయిన ఐపీ అడ్రస్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్‌ దొంగలించారని సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచే ప్రతి పేపర్‌ వివరాలను తెలుసుకుని.. వాటిని దొంగలించారని తేల్చారు. కాన్ఫిడేన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కంప్యూటర్‌ను మరమ్మత్తు చేసిన రాజశేఖర్‌నే.. ఈ మొత్తం విషయానికి మూలం అని సిట్‌ బృందం గుర్తించింది. అతనే డైనమిక్‌ ఐపీ అడ్రస్‌కు బదులు స్టాటిక్‌ ఐపీ కంప్యూటర్‌ పెట్టినట్లు తెలుసుకున్నారు. అయితే సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ సాయంతోనే ప్రశ్నాపత్రాలను నిందితుడు ప్రవీణ్‌ కాపీ చేసినట్లు అధికారులు కనుగొన్నారు.

ప్రవీణ్‌ వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లోనే ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాలను కాఫీ చేసినట్లు సిట్‌ అధికారులు వివరించారు. ఆ పరీక్ష ప్రశ్నాపత్రాలను రేణుక, ఆమె భర్త డాక్యాకు విక్రయించినట్లు సిట్‌ బృందం తేల్చింది. అధికారులు దర్యాప్తులో భాగంగా ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను సైతం నిశితంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రాలను అమ్మిన తర్వాత రేణుక ఇచ్చిన రూ. 10లక్షలను ఎస్‌బీఐ ఖాతాలో ప్రవీణ్‌ చేసుకున్నట్లు చెప్పారు. మరో రూ. 3.5 లక్షలను తన బాబాయ్‌ బ్యాంక్‌ ఖాతాలోకి బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

నిందితుల పిటిషన్‌ రేపటికి వాయిదా:ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. 9 మంది నిందితులను 10రోజుల కస్టడీకి పోలీసులు కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details