దిశ హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. షాద్‌నగర్ వద్ద నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనా స్థలం చటాన్‌పల్లి ప్రాంతానికి సిట్ బృందం వెళ్లింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించిన సిట్ - cp mahesh bhagavath latest news
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు గల సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. తొలిరోజు దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించిన సిట్
దిశ మృతదేహం దహనం చేసిన ప్రాంతం నుంచి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఎంత దూరం ఉంది? ఏ క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగింది, ఎంతమంది పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారనే.. తదితర అంశాలను విశ్లేషించారు. రేపు మరోసారి సిట్... ఘటన స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు