ఐటీ గ్రిడ్స్ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ సిట్ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్‌కు ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసిన స్పందించలేదు. మళ్లీ నోటీసులను కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి అంటించారు. ఒకవేళ బుధవారం హాజరు కాకపోతే సిట్ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతారు.
సిట్ ముందుకు అశోక్..? - ASHOK
ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు సిట్ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్ విచారణకు హాజరవుతాడా..? లేదా..? అన్నది ఉత్కంఠంగా మారింది.
![సిట్ ముందుకు అశోక్..?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2676405-748-69116b5f-014a-417e-bbf4-2e20f185808a.jpg)
నోటీసు
ఇదీ చూడండి:తొలి జాబితాను ప్రకటించనున్న గులాబీ బాస్