తెలంగాణ

telangana

ETV Bharat / state

Sirpurkar Commission Inquiry: దిశ నిందితుల్లో మైనర్లున్నారా? - తెలంగాణ వార్తలు

Sirpurkar Commission Inquiry: దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణను సిర్పుర్కర్ కమిషన్ కొనసాగిస్తూనే ఉంది. దిశ నిందితుల్లో మైనర్లున్నారని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని కమిషన్ ప్రశ్నించగా.. ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్​ రెడ్డి తెలిపారు.

Sirpurkar Commission Inquiry, దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ
దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణ

By

Published : Nov 23, 2021, 10:05 AM IST

Sirpurkar Commission Inquiry: దిశ నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్‌ కోటా పేర్కొన్నారు. వారికి సంబంధించిన రికార్డులు అన్నింటిలోనూ మేజర్లే అని ఉన్నట్లు వెల్లడించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు (Disha encounter case update) నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట సోమవారం ఆయన వాదనలు వినిపించారు. వారు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.

నిందితులు కాల్పులు జరపడంతో గత్యంతరం లేని స్థితిలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ దిశ అత్యాచారం జరిగినప్పటి నుంచి ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వారిని అరెస్టు చేసినప్పుడు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు 40వేల మంది ప్రజలు చేరుకున్నారని, నిందితులను తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారన్నారు. చివరకు చర్లపల్లి జైలుకు తరలించినప్పుడు కూడా అక్కడకీ జనం చేరుకున్నారని, అందుకే వారికి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే సేఫ్‌హౌస్‌లో ఉంచారని కమిషన్‌కు తెలిపారు. ప్రజల దృష్టిలో పడకూడదనే ఆలోచనతోనే తెల్లవారుజామున నేరస్థలానికి తీసుకెళ్లారని తెలిపారు. సాక్షులు, లారీ యజమాని చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారని తెలిపారు. అనంతరం విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details