తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో ప్రచార అనుమతికి 'ఏకగవాక్ష' పద్ధతి - జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో సింగిల్ విండో విధానం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రచార అనుమతుల కోసం ఏకగవాక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. అనుమతుల కోసం అన్ని కార్యాలయాలు తిరగకుండా ఒకే దగ్గర అనుమతులు పొందొచ్చని జీహెచ్​ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్​కుమార్ సూచించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార అనుమతుల కోసం ఏకగవాక్ష పద్ధతి
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార అనుమతుల కోసం ఏకగవాక్ష పద్ధతి

By

Published : Nov 19, 2020, 7:01 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యుల ఎన్నికల్లో ప్రచార అనుమతుల కోసం ఏకగవాక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఎన్నికల్లో ప్రచార సంబంధిత కార్యక్రమాలైన ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలు, సభలు, వాహనాల అనుమతులు, వాహనాల పాసులను జారీ చేయడానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విభాగానికి జీహెచ్ఎంసీ ఓఎస్డీ అనురాధను నియమిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్​కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అనుమతుల నిమిత్తం అన్ని కార్యాలయాలు తిరగకుండా ఒకే దగ్గర అనుమతులు పొందొచ్చని సూచించారు.

ఇవీచూడండి:వైద్య విద్యలో కరోనా యోధుల పిల్లలకు రిజర్వేషన్లు

ABOUT THE AUTHOR

...view details